హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గంజాయి వ్యాపారంలో నిమగ్నమైన అంగూర్ బాయిపై పీడీ యాక్ట్‌ను విధించారు. ఎక్సైజ్ శాఖ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకోబడింది. పలుమార్లు బెయిల్‌పై విడుదలై, తిరిగి నేరం చేసినందున ఈ కఠిన చర్య అవసరమైంది. అంగూర్ బాయిపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్ లో స్థిరపడి.. గంజాయి డాన్ గా ఎదిగిన అంగూర్ బాయిపై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ యాక్ట్ ఆదేశాలను జారీ చేశారు. గంజాయి వ్యాపారంలో మునిగితేలిన అంగూర బాయి కుటుంబం పై ఎన్ని మార్లు కేసులు పెట్టినా తిరిగి బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండడంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమల్ హాసన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, దూల్పేట్ ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి ప్రతిపాదించిన పీడీ యాక్ట్ ప్రతిపాదనలకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను చంచల్ గూడ జైల్లో ఉన్న అంగూర్ బాయికి దూల్పేట్ సీఐ మధుబాబు అందించారు. గంజాయి అమ్మకానికి సంబంధించి అంగూరు బాయిపై 30కి పైగా కేసులు ఉన్నాయి. 20 ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నూ, మరో 10 సివిల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి.
Also read
- హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న పరమార్థం అదే! –
- నేటి జాతకములు..13 మార్చి, 2025
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!