February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: కోటి లోన్.. EMI కట్టట్లే.. జప్తు చేసేందుకు ఇంటికి అధికారులు.. నివ్వెరపోయిన యజమాని..

ఇది మోసాల సమాజం అయిపోయింది. ఎవడు.. ఎలా మస్కా వేస్తాడో తెలియడం లేదు. అప్రమత్తంగా లేకుండా మన ఖేల్ ఖతం. తాజాగా యజమానికి తెలియకుండా.. అతని ఇంటిపై ఓ దళారి కోటి లోన్ తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత EMIలు కట్టకపోవడంతో.. బ్యాంకు అధికారులు సీన్‌లోకి రావడంతో.. బాగోతం బయటపడింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఇంటి ఓనర్.. డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నగరంలోకి ప్రకాశ్ నగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.


ప్రకాష్ నగర్‌లో నివాసం ఉంటే భూషణ్ రోజువారి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి సొంతింట్లో ఉంటున్నాడు. అతని కూతురికి పెళ్లి కుదిరింది. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో… తన బాధను వ్యక్తపరిచి డబ్బు సర్దాలని కోరాడు. ఓ ప్రైవేటు ఫైనాన్షియర్ వద్ద డబ్బులు ఇప్పిస్తానని భూషణ్‌కు దినకర్ చెప్పాడు. తన భార్య రజినీకి ప్రకాశ్ నగర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టినట్లు భూషణ్ చేత పేపర్లపై కొన్ని సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ. 4 లక్షలు ఇచ్చాడు.

ఆ తర్వాతే దినకర్ తన ప్లాన్ అమలు చేశాడు. ఆ ఇల్లు తన భార్యతో పేరుతో ఉన్నట్లు ఫేక్ డ్యాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. భూషణ్‌కు తెలియకుండానే అతడి ఇంటిని బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.కోటి వరకు లోన్ తీసుకున్నాడు. మెుదటి 2 నెలలు EMIలు కట్టిన దినకర్.. ఆ తర్వాత మానేశాడు. దీంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. వాటికి రెస్పాండ్ కాకపోవడంతో సీజ్ చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ప్రకాశ్ నగర్‌లోని భూషణ్ ఇంటికి వచ్చి.. లోన్ తీర్చనందున ఇంటిని జప్తు చేస్తున్నట్లు చెప్పారు.

భూషణ్‌తో పాటు కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. తాము ఎలాంటి రుణం తీసుకోలేదని బోరుమన్నారు. దినకర్ అనే వ్యక్తి భార్య పేరుతో ఈ ఇల్లు ఉన్నట్లు బ్యాంకు వాళ్లు డాక్యుమెంట్స్ చూపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భూషణ్ కుటుంబ సభ్యులు.. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని అడ్డుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి పోలీసులే.. బాధితుల తరపు లాయర్‌తో కలిసి బ్యాంకుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు. దినకర్ చేసిన మోసం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసుల నమోదు చేసుకొని దినకర్ కోసం గాలింపు చేపట్టారు.

Also read

Related posts

Share via