ఆంధ్రప్రదేశ్ అబ్బాయి, మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.. ఇద్దరూ ఒకరినొకరు మనసు పడ్డారు.. మనసులు కలవడంతో.. ఇద్దరూ పెద్ద ప్లానే రచించారు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.. దాని కోసం గంజాయ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.. అయితే.. దొరకకుండా ఉండేందుకు ఓయో రూమ్‌లను ఎంచుకున్నారు.. ఓయో రూమ్స్‌లో ఉంటూ గంజాయి వ్యాపారం ప్రారంభించారు.. చివరకు అసలు గుట్టు బయటకు రావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. ఓయో రూమ్స్ లో ఉంటూ ఇద్దరూ చేస్తున్న దందాను రట్టు చేశారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.. కొండాపూర్‌లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి దందా చేస్తున్న యువతీ, యువకుడిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు..
ఎస్టీఎఫ్ అధికారి నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేందుల రాజు (25) కు మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా (18) తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఓయోరూమ్స్‌లో గదులు అద్దెకు తీసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు.
కొంతకాలంగా కొండాపూర్‌లోని ఓయో రూంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం రాత్రి ఎస్టీఎఫ్ బృందం తనిఖీలు నిర్వహించి అసలు గుట్టును రట్టుచేసింది.. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ నుంచి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..
- వాట్సప్ మెసేజ్ గొడవ .. హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య!
- అర్ధరాత్రి వృద్ధురాలి అగచాట్లు.. దారి మళ్లించి దోచుకున్న ఆటో డ్రైవర్! ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!





