April 19, 2025
SGSTV NEWS
CrimeTechnology

Hyderabad: శవం మిస్టరీని మడతెట్టేసిన ఫోన్ కాల్.. దెబ్బకు సీన్ సితారయ్యింది..




హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న గాంధీనగర్‌లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు. కానీ నో డౌట్‌.. హత్యే.. ఇంట్లో ఇంకా ఎవరున్నారు..? సామాన్లున్నాయి. కుటుంబం వుందనే ఆనవాళ్లున్నాయి. మరి మనుషులేరి? అంటే కుటుంసభ్యులను కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారా? మరో రూమ్‌లో చూస్తే పోలా? ఇక్కడా ఎవరూ లేరూ. మెట్ల పై నుంచి అతను కిందకు వెళ్లాక దాడి చేశారా?ఇక్కడే చంపేసి శవాన్ని ఈడ్చుకొచ్చి సంప్‌లో పడేశారా? ఇలా ఎన్నో అనుమానాలు..

ఎంతటి నేరస్తుడైనా ఏదో ఒక్క చిన్న క్లూ వదలక మానడు.మరి ఇక్కడ అలాంటి ఆధారాలు ఏమున్నాయి. ఉంటాయి. డెఫినెట్‌గా ఏదో ఒక క్లూ దొరకాల్సిందే..లెట్స్‌ చెక్‌.. ఎంత గాలించినా.. ఎంత తర్జనపడ్డ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎందుకంటే అసలు అక్కడ విచారణే జరగలేదు. కానీ. కానీ అక్కడ శవం ఉన్నది నిజం. హత్య జరిగిందన్నది నిజం. ఇరుగు పొరుగు కూడా ఆ నిజం తెలియదు. కంప్లేంట్‌ అంది వుంటే కదా ఖాకీలొచ్చేది? రావడం ఆలస్యం కావచ్చు. కానీ పోలీసులు ఇక్కడకు రావడం మాత్రం పక్కా అనుకున్నారు స్థానికులు.

ప్లేస్‌ ఛేంజ్‌.. సీన్‌ ఛేంజ్‌. ఓవర్‌ టు అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌.ఇక్కడ జరుగుతోంది అసలు ఇన్వెస్టిగేషన్‌. సత్నాసింగ్‌ మిస్సింగ్‌ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు పోలీసులు. అతని కుటుంబసభ్యుల ఇచ్చిన వివరాలను సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. చాలా సార్లు సమస్యల్లో నుంచే సమస్యకు పరిష్కారం దొరకుతుంది. కంప్లేంట్‌లో అలాంటి క్లూ ఏదైనా దొరుతుందా… ఆని ఆలోచన పడ్డారు పోలీసులు. అప్పుడే పోలీసు అధికారి ఒక ఫోన్ కాల్ లిఫ్ట్‌ చేశారు. కంప్లేంట్‌ కాపీలో క్లూ దొరకలేదు. బట్‌ కంప్లేయనర్స్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌లో కీలక సమాచారం తెలిసింది. వెదకబోయిన తీగ కాల్‌కు తగులుతుందని ఆఫీసర్‌ గట్‌ ఫీలింగ్‌. నెక్ట్స్‌ ఏం చేయాలో ఐడియా ఫ్లాషయింది. ఫైల్‌ క్లోజ్‌ చేశారు

తాము అనుకున్నదే జరగబోతుందా? ప్లాన్‌ బి అమలు చేయాలా? సత్పాల్ సింగ్‌ మిస్సయ్యాడా? ఫైనాన్సియర్‌ కాబట్టి, కిడ్నాప్‌ చేసే అవకాశాలున్నాయి. కానీ బెదిరింపు కాల్స్‌ ఏవీ రాలేదు. కిడ్నాప్‌ చేస్తే గదిలో కూర్చుబెట్టి మర్యాదలు చేయరు కదా. ఒక వేళ నిజంగానే కిడ్నాప్‌ చేసి వుంటే..ఈపాటి కాల్స్‌ వచ్చి వుండాలి.రాలేదంటే అర్ధం ఏంటీ..? అంటే అతన్నేమైనా చేశారా.. అదే నిజమై వుంటే..ఆ అవసరం ఎవరికి వుండి వుంటుంది. శత్రువులున్నారా? లేక మరేదైనా కోణం ఉందా? ఎన్నో కేసుల్ని ఛేదించిన ఆఫీసర్‌లో రకరకాల ఆలోచనలు. ఫైనల్‌‌గా ఓ నిర్ణయానికి వచ్చారు పోలీసుు. ఆరోజకు ఫైల్‌ క్లోజయింది.

సత్పాల్‌ సింగ్‌ మిస్సింగ్‌ కేసు మిస్టరీ త్వరలోనే బ్రేక్‌ చేస్తామనే నమ్మకం కుదిరింది పోలీసులకు. నేరుగా పోలీసుల బృందం అల్వాల్‌లో సత్ఫాల్‌ సింగ్‌ ఇంటికి వెళ్లింది. ఇంట్లో అంతా నిశ్శబ్దం. సత్పాల్‌ జాడ కోసం వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. అతనికి ఏమైంది? ఎలా వున్నాడు? ఇంటిల్లిపాదిలో ఆందోళన.. పప్పా ఎప్పుడొస్తాడని పిల్లల బాధలో వున్నారు. సత్ఫాల్‌సింగ్‌ కాల్‌డేటాను పరిశీలించారు పోలీసులు. కానీ అందులో అనుమానాస్పద కాల్స్‌ ఏవీ లేవు అని ఎంక్వియరీలో నిర్దారణయింది. కాల్‌డేటాతో కేసు ను చేధించుకున్న హోప్ప్‌ పోయాయి. పోయాయని అనుకున్నారే..గానీ పోలేదు. ఒక్క ఫోన్‌ కాల్‌.. మిస్టరీని చేధించింది.

కట్‌ చేస్తే.. ఇదే ఆఫీసర్‌ గాంధీనగర్‌లో.. అల్వాల్‌లో ఫైనాన్షియర్‌ సత్ఫాల్‌ సింగ్‌ మిస్సింగ్‌కు.. గాంధీనగర్‌లో మర్డర్‌కు లింక్‌ వుంది. రెండు కేసులు ఒక మిస్టరీ అనుకుంటే మీ లెక్క తప్పినట్టే. ఒకే కేసు ఒకే మిస్టరీ. అదేంటని కూపీలాగితే ఎంక్వయరీ టీ షాప్‌ పై ఫోకసైంది. ఛాయ్‌వాలా నవీన్‌ జంప్‌. అతని ఇంట్లో శవమైంది మరెవరో కాదు ఫైనాన్షియర్‌ సత్ఫాల్‌ సింగ్‌.

సత్ఫాల్‌ సింగ్‌.. ఫైనాన్షియర్‌. నవీన్‌కు అప్పు ఇచ్చాడు. అతనూ రెగ్యూలర్‌ కట్టేవాడే. ఉపాధి కోసం వలస వచ్చి భార్యా బిడ్డలతో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఓ ఇల్లు కొన్నాడు. బిజినెస్‌ తక్కువ అప్పులు ఎక్కువయ్యాయి. సత్పాల్‌సింగ్‌కు నవీన్‌కు మధ్య గొడవ జరిగింది. ఒకరోజు సత్ఫాల్‌ తన బంధువుతో కలిసి గాంధీనగర్‌ వచ్చాడు. బంధువు అతన్ని డ్రాప్‌ చేసి వెళ్లాడు. సత్పాల్‌సింగ్, నవీన్‌ దగ్గరకు వెళ్లి డబ్బు గురించి అడిగాడు. ఇంట్లో మాట్లాడుకుందామని తీసుకెళ్లాడు నవీన్‌. ఇక ఆ తరువాత ఏం జరిగి వుంటుందో మీకు అర్ధమవుతోంది కదా..

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కొట్లాట కూడా జరిగింది. నవీన్‌ కత్తితో దాడి చేశాడు. చంపేసి.. శవాన్ని సంప్‌లో పడేసి.. ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. శవం చెప్పదు కదా.. నిజం తెలియదనుకున్నాడు. కానీ శబ్దతరంగాలు అని క్రైమ్‌ చిత్రాన్ని దృశ్య రూపంలోకి మార్చాయి. అర్ధమైంది కదా.. ఒక్క ఫోన్‌కాల్‌తో మిస్టరీ చేధించారు పోలీసులు. కాల్‌ డేటాలో క్లూ దొరకలేదన్నది నిజం. ఫోన్‌కాల్‌తోనే మిస్టరీ రివీలైందన్నది నిజం. అదెలాగంటే.. సత్ఫాల్‌ సింగ్‌, నవీన్‌ ఇంటికి వచ్చేటప్పటికి అతని బ్యాటరీ చార్జింగ్‌ అయిపోయి అతని ఫోన్‌ స్విచ్చాప్‌ అయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని రిక్వెస్ట్‌ చేసి ఇంటికి ఫోన్‌ చేశాడు. కానీ ఎక్కడ వున్నాడనే విషయం చెప్పలేదు. ఓ గంటలో వచ్చేస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. బంధువులకు ఆ విషయం గుర్తుకు వచ్చి పోలీస్ ఆఫీసర్‌కు చెప్పారు. ఆ నెంబర్‌ ఆధారంగా కూపీలాగితే నవీన్‌ ఇంటి లొకేషన్‌ తళుక్కుమంది. వచ్చి చూస్తే ఇళ్లు లాక్‌ చేసి వుంది. బ్రేక్‌ చేసి లోనికి వెళ్తే.. షాకింగ్‌ సీన్‌. సంప్‌లో సత్పాల్‌ సింగ్‌ శవమై కనిపించాడు. మరి నిందితుడు నవీన్‌ ఎక్కడ..? తెలుగు రాష్ట్రాల గట్టు దాటి చెక్కేద్దామనుకున్నాడు. కానీ విశాఖ దాటక ముందే అతన్ని క్యాచ్‌ చేశారు. అట్లుంటది మరి తెలంగాణ పోలీసింగ్‌.. హ్యాట్పాఫ్‌ కొట్టాల్సిందే మరి

Also Read

Related posts

Share via