హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో విషాదం నెలకొంది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్ధి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
హయత్‌నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్ అయినా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతూ, హాస్టల్‌లో ఉంటున్నాడు లోహిత్. రాత్రి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో లోహిత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ యాజమాన్యంకు సమాచారం ఇవ్వగా.. హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
ఇది చదవండి: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్.. ఎందుకో తెలుసా..?
ఫిజిక్స్ టీచర్ క్లాస్ రూమ్‌లో క్లాస్ లీడర్‌తో కొట్టించడంతో పాటు టీచర్ వేధించడంతో విద్యార్థి లోహిత్ చనిపోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతోందని హాస్టల్ ఎదుట విద్యార్థి బంధువులు ఆందోళన దిగడంతో పోలీసులను భారీగా మోహరించారు. కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే