October 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: కిరాణ షాపులో ఆయుర్వేదిక్ చాక్లెట్ల అమ్మకాలు.. ఎంటా అని చూడగా దిమ్మతిరిగే ట్విస్ట్..

అదో కిరాణ దుకాణం.. అందులో పవర్ ఆయుర్వేదిక్ ఔషి ప్యాకెట్.. ఇదేదో ఆయుర్వేదిక్ ఔషధమేమో అనుకున్నారా.. కానే కాదు.. ఇదో చాక్లెట్.. ఓరి నీ.. చాక్లెటేగా.. చిన్న పిల్లలు తింటారు.. మనకెందుకులే అనుకునేరు.. ఇక్కడ కూడా మరో ట్విస్ట్ ఉంది.. ఇది అలాంటి ఇలాంటి చాక్లెట్ కాదు.. కొంచెం కాస్ట్లీ అంతే.. అంటే ఏం చాక్లెటో అనుకుంటున్నారా..? అదే.. గంజాయ్ చాక్లెట్.. అవును చెప్పింది నిజమే.. గంజాయ్ చాక్లెటే.. ఎక్కడో కాదు.. మన దగ్గరే.. మన హైదరాబాద్‌లోనే.. ఓ కిరాణ షాపులో గంజాయ్ చాక్లెట్లు లభించడం కలకలం రేపింది.. హైదరాబాద్‌ నగరంలోని పేట్‌బషీరాబాద్ పరిధి సుభాష్‌నగర్‌లో మేడ్చల్ ఎస్ఓటి తనీఖీలు నిర్వహించారు.. ఈ క్రమంలో కోమల్‌ కిరాణా షాపు నుంచి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.


కోమల్ కిరాణా షాపులో 6 నెలలుగా గంజాయ్ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌ ఎస్‌వోటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు.. గంజాయ్ చాక్లెట్లను సరఫరా చేస్తున్న పివేష్‌ పాండే అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు నమోదు చేసిన పేట్ బాషీరాబాద్ పోలీసులు.. గంజాయ్ చాక్లెట్ల వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు.. అనే వివరాలను సేకరిస్తున్నారు.

Also read

Related posts

Share via