SGSTV NEWS
CrimeTelangana

మియాపూర్‌లో దారుణం.. 5వ అంతస్తుపై నుంచి దూకేసిన పదో తరగతి విద్యార్ధిని! ఆ తర్వాత



ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధిని ఏం జరిగిందో తెలియదుగానీ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్ధిని తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా..

హైదరాబాద్, జులై 24: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్ధినిని మియాపూర్ లోని ప్రైవేట్ పాఠశాలలు పదవ తరగతి చదువుతున్న హన్సిక (14)గా గుర్తించారు. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఐదవ అంతస్తు పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

తీవ్ర గాయాలతో రక్తస్రావమైన హన్సిక ఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా గత కొంత కాలంగా రాష్ట్రంలో విద్యార్ధుల వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు గత కారణాలు వేర్వేరు అయినప్పటికీ.. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు చిన్న కారణానికే ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్ధుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఓ కన్నేసి ఉంచి, ఎప్పటికప్పుడు వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారికి మరింత భరోసా కల్పిస్తే ఇలాంటి విషాద సంఘటనలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Also read

Related posts

Share this