SGSTV NEWS
CrimeTelangana

Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల చేతిలోనే హతమయ్యాడు.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలంలోని పిట్టలోనిగూడెంలో జరిగింది.. కనకయ్య అనే వ్యక్తి ఇద్దరు భార్యల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.. కట్టుకున్న ఇద్దరు భార్యలు శిరీష, గౌరమ్మ.. కనకయ్యను గొడ్డలితో నరికి చంపడం కలకలం రేపింది. ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు..

సోమవారం అర్ధరాత్రి ఇద్దరు భార్యలు శిరీష, గౌరమ్మ.. కనకయ్యకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుని.. ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన ఇద్దరు భార్యలు.. కనకయ్య పట్టుకుని.. ఒకరు రాయితో బలంగా మోదగా, మరొకరు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే.. ప్రాథమిక సమాచారం ప్రకారం కనకయ్యకు ఇదే గ్రామానికి చెందిన శిరీష, గౌరమ్మ అనే అక్కా చెల్లెళ్లతో వివాహం జరిగింది.. కొద్దిరోజుల క్రితం వీరి తల్లి హత్యకు గురయ్యింది.. ఈ నేరంతో కొన్నిరోజుల పాటు కనకయ్య జైలు పాలయ్యాడు.. అనంతరం అక్కా చెల్లెళ్లు తన తల్లి గారింటికి వెళ్ళి పోయారు..

జైలు నుండి బయటకు వచ్చిన కనకయ్య తన భార్యల వద్దకు వెళ్ళాడు.. ఈ క్రమంలో తన ఇద్దరు భార్యలతో ఘర్షణ చెలరేగింది. సహనం కోల్పోయిన ఇద్దరు భార్యలు అతనిపై దాడికి పాల్పడ్డారు.. గొడ్డలితో నరికి చంపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న లింగాల ఘనపూర్ పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని జనగామ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే కనకయ్య గతంలోనే పలు వివాదాల్లో తలదూర్చి కేసుల పాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.

Also read

Related posts

Share this