ఇంట్లో చనిపోతే.. ఏమో జరుగుతుందని భావిస్తున్న ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో అద్దెకు ఉంటున్న వారు అనారోగ్యంతో బాధ పడితే.. ఆ ఇంట్లోకి రానివ్వడం లేదు యజమానులు. ఇలాంటి సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది..
ఇప్పటికీ.. మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు కొంత మంది. ఇంట్లో చనిపోతే.. ఏమో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అద్దెకు ఉంటున్న వారు అనారోగ్యంతో బాధ పడితే.. ఆ ఇంట్లోకి రానివ్వడం లేదు యజమానులు. ఇలాంటి సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. దీంతో గత్యంతరంలేక అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే స్మశానానికి తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే యువకుడు హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ధర్మపురికి తీసుకువచ్చారు. కాగా గోపికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని అనుమతించలేదు. దీంతో గత్యంతరం లేక అతను బతికుండగానే స్మశానానికి తరలించి, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సపర్యలు చేశారు. స్మశానంలో వీరి దిన పరిస్థితి గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించి సంఘ భవనంలోకి ఆ వ్యక్తిని, కుటుంబ సభ్యులను అక్కడికి తరలించారు.
విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన వంతు సాయంగా పదివేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. కాగా సొంత ఇల్లులేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయని అన్నారు. అద్దెకు ఉండే వ్యక్తులు చనిపోతే.. ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో.. నేరుగా స్మశాన వాటికకు తుసుకెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు తమ గోడు మంత్రికి విన్నవించుకున్నారు
Also read
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు.. ఇంతలో
- జులై 12.. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. అప్పులు రాసిన మరణ శాసనం.. అయ్యో పిల్లలు..