సంతోష్ దాబా వారికి హైదరాబాద్ నగరంలో అబిడ్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట్, ప్యారడైజ్, మియాపూర్ అల్విన్ సర్కిల్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. సంతోష్ దాబా యాజమాన్యం ఎవరికి ఫ్రాంచైజ్ కూడా ఇవ్వలేదు. వెజ్ ఫుడ్ విషయంలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది.
ఫుడ్ అంటే ఓ ఎమోషన్. తమకు నచ్చిన ఫుడ్ తినడానికి ఎంత దూరమైనా వెళ్తారు భోజన ప్రియులు. కడుపుకి రుచికరమైన భోజనం, కంటికి ఇంపుగా నిద్ర లేకుంటే, జీవితం ఎందుకు అన్నది కొందరి వెర్షన్. అలా హైదరబాద్ మహానగరంలో వెజ్ విషయంలో సంతోష్ దాబా ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది. సరసమైన ధరలకే నోరూరించే వెజ్ భోజనాలని అందిస్తుంది.
సంతోష్ దాబా వారికి హైదరాబాద్ నగరంలో అబిడ్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట్, ప్యారడైజ్, మియాపూర్ అల్విన్ సర్కిల్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. సంతోష్ దాబా యాజమాన్యం ఎవరికి ఫ్రాంచైజ్ కూడా ఇవ్వలేదు. అయితే సమాజంలో అన్ని చోట్లా పెరిగినట్లే ఫుడ్ బిజినెస్‌లోనూ ఫేక్‌గాళ్ళు పెరిగిపోయారు.
సంతోష్ దాబా బ్రాండ్‌కు ఉన్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు.. సంతోష్ దాబా పేరును స్లైట్‌గా మార్చి.. జంట నగరాల్లో కుప్పలు తెప్పలుగా రెస్టారెంట్స్ వెలిశాయి. న్యూ సంతోష్ దాబా, రామ్ సంతోష్ దాబా, జై సంతోష్ దాబా అంటూ.. రకరకాల పేర్లు పెట్టి సంతోష్ దాబాను మాత్రమే హైలెట్ చేసి ముందు, వెనుక తోకలు తగిలించండం చేసేవారు.
అమాయక కస్టమర్స్ అవి నిజమైన సంతోష్ దాబాలుగా భావించి భోజనం చేస్తున్నారు. కానీ అక్కడ శుభ్రత, క్వాలిటీ శూన్యం. దీంతో కస్టమర్స్ నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో సంతోష్ దాబా అసలు యజమాని సునీల్ చర్యలకు ఉపక్రమించారు. సంతోష్ దాబా పేరుతో యజమాని సునీల్‌కు కాపీరైట్ ఉండడంతో ఆ పేరుపై వ్యాపారాలు నిర్వహించి తన బ్రాండ్ దెబ్బ తీస్తున్నారని పిటిషన్ వేయడంతో కోర్టు పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టింది
విచారణ జరిపిన ధర్మాసనం సంతోష్ దాబా పేరుకు ముందు, వెనకాల ఎలాంటి పదాలతో హోటల్ బిజినెస్ చేసుకోవడానికి వీలు లేదంటూ హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులతో దాదాపు నగరంలో 200 చోట్ల సంతోష్ దాబా పేరుతో ఉన్న బోర్డులను బెయిలీఫ్, పొలీసులు తొలగించేశారు.
Also read
- Astro Tips: ఈ నెల 16న ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్న చంద్రుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారమే..
- Holi 2025: హోలీ నాడు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం..
- Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?