నగ్న ఫోటోలు కావాలంటూ గుర్తు తెలియని యువకుడు ఐటి ఉద్యోగి కి నరకం చూపించాడు. ఐటీ ఉద్యోగి గా ఓ వ్యక్తి గచ్చిబౌలిలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. జూలైలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఐటి ఉద్యోగికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుట్టినరోజు సందర్భంగా ఆ యువకుడి ఐటి ఉద్యోగి..
నగ్న ఫోటోలు కావాలంటూ గుర్తు తెలియని యువకుడు ఐటి ఉద్యోగి కి నరకం చూపించాడు. ఐటీ ఉద్యోగి గా ఓ వ్యక్తి గచ్చిబౌలిలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. జూలైలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఐటి ఉద్యోగికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుట్టినరోజు సందర్భంగా ఆ యువకుడి ఐటి ఉద్యోగి ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తరచూ కాల్ చేస్తూ ఇబ్బందులు గురి చేశాడు.
ఇలా తరచూ కాల్ చేస్తూ ఫోన్ ఎత్తకపోతే instagram లోని పోస్టులకు అసభ్య కామెంట్లు చేస్తూ నగ్న చిత్రాలు పంపాలంటూ వేధించేవాడు. సోషల్ మీడియా లో, ఫోన్‌లో బ్లాక్ చేస్తే వేరువేరు నెంబర్లనుండి వేరువేరు అకౌంట్స్ నుంచి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధించేవాడు. తన ఖాతాలను ఆన్‌బ్లాక్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గత్యంతరం లేక అన్ బ్లాక్ చేయడం తో మళ్లీ వేధించేవాడు. తాను చెప్పినట్లుగా వినాలని అసభ్యంగా మాట్లాడేవాడు. అంతేకాదు ఐటి ఉద్యోగి తండ్రి సోదరులకు ఫోన్ చేసి మీ అబ్బాయికి స్నేహితుడని సోషల్ మీడియాలో నన్ను బ్లాక్ చేసాడని చెప్పేవాడు. ఇంకా ఈ వేధింపులు ఎంతకి ఆగక పోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు
Also read
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!