డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై యూత్ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు వీటి మత్తులో కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు ఏకంగా చిన్నప్పటి నుంచి తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మమ్మనే హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై యూత్ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు వీటి మత్తులో కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. గంజాయికి బానిసైన ఓ యువకుడు ఏకంగా చిన్నప్పటి నుంచి తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మమ్మనే హతమార్చాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపినక వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సకునవీడు గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు తన చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో అతన్ని తన అమ్మమ్మ అయిన శాఖమూరి పద్మ పెంచి పెద్దచేసింది. అయితే చదువుకొని బాగు పడాల్సింది పోయి సాయి జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే గంజాయి, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు.
అయితే ఇటీవల ఇంటికొచ్చిన సాయి మత్తులో తనను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మనే కిరాతకంగా మత్య చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గంజాయి మత్తులో మనవడే ఈ హత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కొందరు యువకులు గంజాయిని విచ్చలవిడిగా సేవిస్తున్నారని వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!