వారసంతలో కొనుగోలు చేసిన వేరు శనగలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. నాలుగేళ్ల బాలుడు శనగ గింజ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయిన ఘటన కొమురంభీం జిల్లా కనికి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం.
కొమురంభీం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కౌటాల మండలం కనికి గ్రామంలో వేరు శనగ విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక నాలుగు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. నాలుగేళ్ల రిషి మృతి చెందిన తీరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొమురంభీం జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన రుషి తండ్రితో కలిసి సోమవారం కౌటాల లోని వారసంతకు వెళ్లాడు. వారసంతలో వేయించిన వేరు శనగలను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చి రాత్రి పడుకునే సమయంలో శనగ కాయలను తింటుండగా ఓ శనగ గింజ గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడకపోవడంతో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. గుర్తించిన తండ్రి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో నే బాలుడు మరణించాడు. ఈ ఘటనతో కనికి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రుషి.. జాడి ప్రకాష్ కళ్యాణి దంపతుల ఏకైక వారసుడు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్‌చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!