SGSTV NEWS
CrimeTelangana

పోలీస్‌ స్టేషన్‌లోనే పొట్టు పొట్టు కొట్టుకున్న అత్తాకోడళ్లు.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే!

Telangana: సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగడం అనేది సర్వ సాధారణం. అత్తగారి మాటలు, ప్రవర్తన కోడలిని బాధపెడితే, కోడలు ప్రవర్తన అత్తగారికి కోపం తెప్పిస్తుంది. అందుకే, వంట, ఇంటి పని వంటి చిన్న విషయాలకే గొడవలు, వాదనలు కొనసాగుతాయి. అయితే ఈ అత్తా కోడళ్ళ మధ్య ఓ పథకం చిచ్చు పెట్టింది. ఈ గొడవ చివరికి పోలీసు స్టేషన్‌లో దాడులకు దారితీసింది. ఈ అత్తా కోడళ్ళగొడవకు కారణమేంటో తెలుసు కోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగడం అనేది సర్వ సాధారణం. అత్తగారి మాటలు, ప్రవర్తన కోడలిని బాధపెడితే, కోడలు ప్రవర్తన అత్తగారికి కోపం తెప్పిస్తుంది. అందుకే, వంట, ఇంటి పని వంటి చిన్న విషయాలకే గొడవలు, వాదనలు కొనసాగుతాయి.అయితే అలాంటి అత్తా కోడళ్ల మధ్య ఇప్పుడు ఓ ప్రభుత్వ పథకం చిచ్చు పెట్టింది. ఈ పథకం విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లి అక్కడ కూడా అత్తా కోడళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, జనగామ గ్రామానికి చెందిన పూలు, సోనా దంపతులకు ఇద్దరూ కొడుకులు. పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. చిన్న కొడుకు రాజేష్.. భార్య శిరీషతో అదే గ్రామంలో ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద శిరీషకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయింది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు కావాలని అత్త సొనాను అడిగింది. ఆర్థిక సహాయం చేసేందుకు అత్త సొనా నిరాకరించింది. నాకు మంజూరు కానీ ఇంటికి డబ్బులు ఇచ్చేది లేదని చెప్పింది. దీంతో అత్తా కోడళ్ళ మధ్య గొడవ ప్రారంభమైంది.

అత్త మామలపై కోడలు శిరీష ఫిర్యాదుతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. కుటుంబ సభ్యుల మధ్యే గొడవ కావడంతో అత్తా కోడళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటుండగానే.. అత్తా- కోడళ్లకు చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఇక గొడవను సద్దుమగించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్లు పథకం అత్తా- కోడళ్ల మధ్య కొత్త పంచాయతీ పెట్టింది

Also read

Related posts

Share this