వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కుటుంబం, కాపురం, పిల్లలు, పరువు గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంబంధాలు రోజూ పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. బయటపడని వాటికి లెక్కే లేదు. ఈ సంబంధాలకు సోషల్ మీడియా ప్రధాన వారధిగా మారుతుంది. తాజాగా…
వీడియో….
ఇద్దరూ వివాహితులే. ఆమెకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతగాడేమో పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకున్నాడు. ఆమెది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్‌నగర్ అయితే.. అతడికి భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామం. ఈ ఇద్దరినీ దగ్గర చేసింది ఫేస్‌బుక్ పరిచయం. ఆ పరిచయం కాస్తా వివాహేతర అక్రమ సంబంధానికి దారితీసింది.
భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతి మర్చిపోయిన ఆమె.. ఫేస్‌బుక్ ప్రియుడ్ని ఏకంగా ఇంటికే పిలిపించుకుంటూ వచ్చింది. అమ్మా.. ఇది తప్పు.. అలా చెయ్యొద్దని ఎన్నోసార్లు నచ్చజెప్పారు ఆ వీధిలోని వాళ్లు. భర్త అయితే.. చెప్పీచెప్పీ విసిగిపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇక అడ్డుచెప్పేవాళ్లెవరూ లేకపోవడంతో.. ఫేస్‌బుక్ ప్రియుడ్ని పర్మినెంట్‌గా ఇంటికి రప్పించుకుంది. ఎన్నో రోజులుగా ఈ బాగోతాన్ని గమనిస్తూ వస్తోన్న కాలనీవాసులు.. ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. బోరింగ్‌కి కట్టేసి దేహశుద్ధిచేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించడంతో కౌన్సిలింగ్ ఇచ్చారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





