ఎవరికి అనుమానం రాకుండా.. చాలా చాకచక్యంగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది. వారువేసే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వాసన గుప్పుమనడంతో ఎలాగోలా ఎక్సైజ్ పోలీసులు ఊపందింది. దీంతో దాడులు చేయడంతో వీళ్ళ బండారం బట్ట బయలు అయ్యింది. కొన్ని సందర్భాల్లో పోలీసులపై దాడులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు.
ఎవరికి అనుమానం రాకుండా.. చాలా చాకచక్యంగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది. వారువేసే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వాసన గుప్పుమనడంతో ఎలాగోలా ఎక్సైజ్ పోలీసులకు ఊపందింది. దీంతో దాడులు చేయడంతో వీళ్ళ బండారం బట్ట బయలు అయ్యింది. కొన్ని సందర్భాల్లో పోలీసులపై దాడులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు గంజాయి సాగు చేసే వ్యక్తులు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
పత్తి చేనులో అంతర్ పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యవసాయ పొలంలో ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు. తండాలో సాగు చేస్తున్న అతని ఇంటికి వెళ్లి ఇంట్లో ఎండు గంజాయి నిల్వ ఉండొచ్చని అనుమానంతో వెళ్లగా ఒక్కసారిగా తండా వాసులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో మధ్య తోపులాట జరిగి పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
నారాయణఖేడ్ మండలం చల్లగిద్దా తండా గ్రామ శివారులో పత్తి చేనులో జానకి రామ్ అనే వ్యక్తి అంతర్ పంటగా 60 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. రహస్య సమాచారం మేరకు సంగారెడ్డి టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు అట్టి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జానకి రామ్ ఇంట్లో కూడా గంజాయి నిల్వ ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు ఇంటికి వెళ్లగా, జానకి రామ్ ఇంటికి గొళ్ళెం పెట్టి పరార్ అయ్యాడు.
దీంతో కొందరు తండా వాసులకు, ఎక్సైజ్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో సీఐ శంకర్ కు గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో నారాయణఖేడ్ డిఎస్పీ తమ సిబ్బందితో తండాకు వెళ్లి పరిస్థితినీ అదుపులో తెచ్చారు. తోపులాటలో తిరగబడ్డ వారిపై ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తోపులాటలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు తోపులాట వీడియోలు చిత్రీకరిస్తుండడంతో వారి ఫోన్లు లాక్కుని దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంలో ఓ గిరిజన నాయకుడు ఉండడం వల్ల కేసు నమోదు కావడంలో ఆలస్యం అవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!