పైసా.. పైసా కూడబెట్టి నమ్మి అప్పజెప్పితే, మహిళలను నిండా ముంచి ఉడాయించాడు ఓ మయాగాడు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్వాక్రా గ్రూపులో మోసాలు జరుగుతున్నాయి.ఆ డ్వాక్రా గ్రూపులలో పనిచేసే వ్యక్తులే డబ్బులు తీసుకొని పరారవుతున్నారు. ఫలితంగా గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు బలైపోతున్నారు. తాజాగా మహిళ సంఘాలకు చెందిన 20 లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లా జిల్లాలో వెలుగు చూసింది.
డబ్బులు కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వరు.. కొత్త రుణాలు కావాలంటే పోయిన డబ్బులు కట్టాల్సిందే. తాము వాడుకోకుండా తమ అవసరాలకు ఉపయోగించు కోకుండా ఎవరో దొంగలించిన డబ్బులను తామెలా కడతామంటూ, ఆ గ్రూపు సభ్యులు లబోదిబో మంటున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దాదాపు 25 గ్రూపులకు సంబంధించి, 17వ వార్డుకు సంబంధించిన పద్మ అనే ఒక మహిళ లీడ్ చేస్తోంది. గత మూడు సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూపులలో పనిచేస్తూ ఉంది. అన్ని సంవత్సరాలుగా అన్ని గ్రూపుల సభ్యులతో కలుపుగోలుగా ఉంటూ అందరినీ నమ్మించి డబ్బులు కట్టించుకుంది. ఇలా వసూలు చేసిన రూ.20 లక్షలతో పరార్ అయింది.
దాదాపు గ్రూపులకు సంబంధించిన ప్రభుత్వ సొమ్ము ఏడు లక్షల రూపాయలు తీసుకొని తన సొంతానికి కి వాడుకుంది. ప్రతినెల తమ డబ్బులు సమయానికి చెల్లించినప్పటికీ తమకు రుణం వచ్చే విషయంలో ఆలస్యం అవుతుందని గ్రూపు సభ్యులు ఆరా తీశారు. దీంతో మహిళలు అసలు డబ్బులు కట్టలేదని అందుకే రుణం రావడం లేదని బ్యాంకు నిర్వాహకులు చెప్పడంతో అవాక్కయ్యారు. అసలు విషయం ఏమిట అని ఆరా తీస్తే ప్రతి నెల తము బ్యాంకుకు జమ చేసే వడ్డీ డబ్బులను దాదాపు ఏడు లక్షల రూపాయలను ఆర్పి పద్మ తన సొంత వాడుకున్నట్టుగా తేలింది. గ్రూపు సభ్యులందరూ పద్మను నిలదీయగా, తప్పు చేశానని ఏడు లక్షల రూపాయలు సొంతంగా వాడుకున్నానని తిరిగి వాటిని కొద్ది రోజుల వ్యవధిలో చెల్లిస్తానని తెలిపింది. దీనిపై పై ఉన్నతాధికారులను వివరణ కోరగా, తమకు విషయం ఆలస్యంగా తెలిసిందని విచారణ చేపడతామని పద్మ దగ్గర నుంచి ఆ డబ్బుని రికవరీ చేస్తామని తెలిపారు.
ఇదిలావుంటే గత 15 రోజులుగా పద్మ కనిపించుకుండాపోయింది. పద్మ ఎవరికి చెప్పకుండా పరారవడంతో ఆమె ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియక గ్రూప్ సభ్యులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒకపక్క డబ్బులు పోగొట్టుకొని, మరోపక్క డబ్బులు కట్టాలని చెప్పే బ్యాంకు అధికారులకు సమాధానం చెప్పలేక అధికారులను ఆశ్రయించారు. అయితే సదరు మహిళపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు తప్ప తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. పద్మ కేవలం గ్రూపు సభ్యుల ద్వారానే కాక తన చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి కూడా దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు అప్పుగా తీసుకుని పారిపోయింది అని ప్రాథమిక సమాచారం. ఇంతవరకు ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాలేదు. మరోవైపు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని బాధిత గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Also read
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే
- వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
- తెలంగాణ: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?