కరీంనగర్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు భవనంపైకి ఎక్కి దూకేస్తానని హంగామా చేశాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కష్టపడి అతన్ని కాపాడారు. అతను రిహాబిలిటేషన్ సెంటర్ నుండి తప్పించుకుని వచ్చాడు. యువకుడిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులలో భయాందోళనలకు కారణమైంది.
ఓ యువకుడు మద్యం మత్తులో హంగామా చేశాడు. బిల్డింగ్‌పైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. పోలిసులు, స్థానికులు నచ్చ చెప్పడంతో కిందికి దిగాడు. తరువాత మళ్ళీ జనాల వైపు పరుగులు తీసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ కెమిస్ట్రీ భవన్ ఎదుట యువకుడు మద్యం మత్తులో రెండస్తుల భవనం పై నుంచి దూకెస్తానంటూ హంగామా సృష్టించాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, వలలు, రోప్, నిచ్చెనల సహాయంతో యువకుడిని కిందకు దింపే ప్రయత్నం చేశారు.
అయితే సదరు యువకుడు పోలీసులను తప్పించుకొని ఒక భవనం పై నుంచి మరో భవనం పైకి దూకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఫైర్ సిబ్బంది కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు, యువకుడిని మాటల్లో పెట్టి తాళ్లతో బంధించారు. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో సదరు యువకుడిని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడిని గత రెండు రోజుల క్రితం నగరంలోని రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ నుంచి తప్పించుకొని జ్యోతి నగర్ ఏరియాలో తిరుగుతూ హంగామ సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా జనం పై దాడికి ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద.. ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025