Telangana: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాలలో జరిగింది. రమాదేవి అనే వైస్ ప్రిన్సిపాల్ ఐదుగురు 9వ తరగతి చదువుతున్న ఐదుగురు బాలికలను చితికబాదింది. చేతులకు వాతలు వచ్చేలా కర్రతో కొట్టింది. టీచర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు పిల్లలపై చూపడం ఏంటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించారు..
ఇద్దరు పంతులమ్మల మధ్య విభేదాలు బాలికల పాలిట శాపమైంది. గురుకుల పాఠశాలలో తనకు గిట్టని టీచర్ తో ఎక్కువ సమయం కేటాయించారని ఓ వైస్ ప్రిన్సిపల్ కర్కశంగా ప్రవర్తించిందని బాధిత బాలికలు ఆవేదన వ్యక్తంచేశారు. స్టడీ వరకు ఎందుకు ఆలస్యమైందని ఐదుగురు బాలికల చేతులకు వాతలు వచ్చేలా కొట్టిందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన దిగారు.
ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాలలో జరిగింది. రమాదేవి అనే వైస్ ప్రిన్సిపాల్ ఐదుగురు 9వ తరగతి చదువుతున్న ఐదుగురు బాలికలను చితికబాదింది. చేతులకు వాతలు వచ్చేలా కర్రతో కొట్టింది. చేతులు కమలిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ఆ బాలికలు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్ళ చేతులపై వాతలు చూసి ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు వైస్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గిట్టని టీచర్ తో విద్యార్థులు ఎక్కువ సమయం కేటాయించారని.. విభేదాలు ఉండడం వల్ల ఆ టీచర్ పై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీచర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు పిల్లలపై చూపడం ఏంటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించారు. పిల్లల చేతులు కమిలిపోయెలా ఎలా కొడతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. బాలికలను విచక్షణారహితంగా కొట్టిన వైస్ ప్రిన్సిపల్ రమాదేవి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు గురుకుల పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు