డబ్బులు, ఆస్తుల కోసం కొంతమంది మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు.. అయిన వారిని సైతం కడతేర్చడానికి వెనకడుగు వేయడం లేదు.. తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి బంధాలు ఏమి చూడడం లేదు.. ఆస్థిని, డబ్బును దక్కించుకోవడం కోసం సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నారు.. కానీ చేసిన తప్పును చాలా రోజులు దాచలేరు కదా.. అందుకే చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు.. ఇలాగే 20 గుంటల భూమి కోసం కోసం నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని చంపేసింది ఓ కూతురు.. అసలు కూతురు అనే పదానికే ఇమే అర్హురాలు కాదు.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మినాజీపేటలో జరిగిన ఈ దారుణ ఘటనలో మంకని బాలమణి (55) అనే మహిళ.. తన కూతురి చేతిలో హత్యకు గురైంది.. తల్లిని హత్య చేసి, తల్లి కాలును కత్తితో కోసి.. కాలికి ఉన్న వెండి కడియాలు కాజేసింది.
మినాజీపేటకు చెందిన మంకని బాలమణి (55), చిన్న బాల నర్సయ్య దంపతులకు లావణ్య, నవనీత అనే ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కూతురు లావణ్యకు ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన బిక్షపతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా.. చిన్న కూతురు నవనీతకు మినాజీపేటకే చెందిన మధుతో పెళ్లయింది. మధుకు రక్తసంబంధీకులు ఎవ్వరూ లేకపోవడంతో నవనీత దంపతులు, తల్లి బాలామణితో కలిసే ఉంటున్నారు. బాలమణి తమకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో కొంత భూమిని గతంలో పెద్ద కూతురు అయిన లావణ్య పేరుమీద రాసింది.. తునికి బొల్లారం సమీపంలోని భూమిని అమ్మి వచ్చిన డబ్బును చిన్నకూతురు నవనీతకు ఇచ్చింది. మరో 20 గుంటల భూమిని లావణ్యకి ఇవ్వాలని, అది పోగా మిగిలిన భూమిని నవనీతకు ఇవ్వాలని అనుకుంది.. ఇదే విషయాన్ని నవనీతకు చెప్పింది తల్లి.. కానీ, అక్కకు భూమి ఇవ్వడం ఇష్టంలేని నవనీత తల్లితో గొడవపడింది. మరోపక్క బాలమణి కొద్ది నెలల క్రితం తూప్రాన్ మండలం యావపురంలో ఉంటున్న తన అక్క కొడుకు రాయని గౌరయ్యకు రూ.3లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ విషయంలో బాలమణి, గౌరయ్యకు గొడవలు ఉన్నాయి.. ఇలా అయితే తనకు భూమి రాదు అని తల్లిని చంపేందుకు పథకం వేసింది చిన్న కూతురు.. తల్లి బతికుంటే మిగత 20 గుంటల భూమి అక్కకు వెళ్లిపోతుందని భావించింది చిన్న కూతురు నవనీత..ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకునేందుకు నిర్ణయించుకుంది.
తల్లిని హత్య చేసేందుకు భర్తతో పాటు, తన తల్లి దగ్గర 3 లక్షలు అప్పుగా తీసుకున్న గౌరయ్యతో చేయికలిపింది..తమకు సహకరిస్తే రూ.3 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి గౌరయ్యను ఒప్పించింది. ఇక, అక్టోబరు 10వతేదీ రాత్రి తండ్రి బాలనర్సయ్య ఇంటి బయట నిద్రిస్తుండగా..నవనీత, ఆమె భర్త మధు, గౌరయ్య ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రలో ఉన్న బాలమణి కదలకుండా కాళ్లు, చేతులు పట్టుకొని ముక్కు, నోరు మూసి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం బాలమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి గౌరయ్య తెచ్చిన ఆటోలో ఎక్కించి అయ్యప్ప చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తొలుత బాలమణి కాళ్లకు ఉన్న వెండి కడియాలు తీసుకున్నారు. ఇక ఎడమ కాలికి ఉన్న కడియం రాకపోవడంతో కత్తితో ఆ కాలును రెండుగా కోసి మరీ కడియాన్ని తీసుకున్నారు..ఆతర్వాత మృతదేహాన్ని చెరువులో పారేశారు.
అనంతరం.. తల్లి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో నవనీత ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా శనివారం నాడు చెరువులో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించగా.. అది బాలమణి మృతదేహమేనని, ఆమె హత్యకు గురైందని పోలీసులు గుర్తించారు. నవనీత, లావణ్యను పోలీసులు విచారించగా..నవనీత చేసిన ఘోరాన్ని బయటపెట్టింది. దీంతో నవనీత, ఆ భర్త మధు, వారికి సహకరించిన గౌరయ్యను పోలీసులు అరెస్టు చేశారు
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





