April 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్ : లైక్స్, రీల్స్ కోసం డేంజర్‌ స్టంట్స్‌.. కళ్ళ ముందే ప్రాణాలు విడిచిన స్నేహితుడు

అసలే వర్షాలు.. రోడ్డంతా జారుతూ ఉంది. ఇలాంటి టైమ్‌లో డేంజర్ ఫీట్స్‌ చేస్తూ సోషల్ మీడియా రీల్స్‌ కోసం ఇద్దరు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం విషాదానికి కారణమైంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తోంది.

సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి, లైక్స్ రావడానికి రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బైక్‌పై డేంజర్‌ స్టంట్స్‌కి నిండు ప్రాణం బలైపోయింది. తనతోపాటు స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఓ యువకుడు స్టంట్స్‌ చేస్తుంటే అది అదుపు తప్పి స్కిడ్ అయ్యింది. బైక్‌పై వెనక కూర్చున్న యువకుడు ప్రాణాలు కోల్పోగా, బైక్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడు కొన ఊరిపితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ మహానగరం శివారు హయత్‌నగర్‌ దగ్గర జరిగింది.

Also read :మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..

అసలే వర్షాలు.. రోడ్డంతా జారుతూ ఉంది. ఇలాంటి టైమ్‌లో డేంజర్ ఫీట్స్‌ చేస్తూ సోషల్ మీడియా రీల్స్‌ కోసం ఇద్దరు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం ఇలా విషాదానికి కారణమైంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు బైక్‌ స్టంట్స్‌కు బలైపోయాడని తెలిసి తట్టుకోలేకపోతోంది. శనివారం (జూలై 20) సాయంత్రం హైదరాబాద్ – విజయవాడ హైవేపై అంబర్‌పేట వద్ద వర్షంలో ఈ బైక్‌పై ఉన్న ఇద్దరూ స్టంట్స్‌ చేస్తుంటే.. మరో బైక్‌పై ఫ్రెండ్స్‌ ఈ దృశ్యాల్ని షూట్ చేస్తున్నారు.

అయితే, క్షణాల్లోనే బైక్ అదుపుతప్పింది ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో తోటి స్నేహితులు హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ శివ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బైక్ నడుపుతున్న యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చేతికందిన కొడుకు ప్రాణాలు విడవడంతో ఆ తల్లిదండ్రులు దు:ఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Related posts

Share via