ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైబర్ కేటుగాళ్లు సామాన్యుల నుండి ప్రముఖుల వరకు బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు వ్యక్తులను టార్గెట్ గా చేసుకున్న్ సైబర్ నేరగాళ్లు.. ఇపుడు బ్యూరోక్రాట్లను కూడా వదలడం లేదు. తాజాగా ఓ జిల్లా ఎస్పీ ఫేక్ ఫేసుబుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్దే పనిచేస్తున్నారు. ఎస్పీ సూర్యాపేట పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ప్రొఫైల్‌లో రాహుల్ హెడ్డే ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట పేరుతోపాటు ఎస్పీ గతంలో చేసిన సామాజిక కార్యక్రమాల ఫోటోలతో రూపొందించిన ఖాతాను ఓపెన్ చేశారు. ఎస్పీ సూర్యాపేట పేరుతో కలిగిన ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడంతో చాలామంది యాక్సెస్ట్ చేశారు. మెసేజ్ లతో అర్జంట్ అవసరం ఉందంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి సూర్యాపేట పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు ఫేక్ అకౌంట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్పీ సూర్యాపేట ఫేస్ బుక్ ప్రొఫైల్ ను పోలిన రెండు నకిలీ facebook ప్రొఫైల్స్ నుండి వచ్చే మెసేజ్ లకు, రిక్వెస్ట్ లకు స్పందించవద్దని వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, డబ్బులు పంపించవద్దని సాక్షాత్తు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డేనే కోరుతున్నారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియా కేంద్రంగా పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్ల మోసాలు, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025