December 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమని తెగ తినేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. సగం బిర్యానీ తిన్నాక షాక్ తగలొచ్చు..



హైదరాబాద్ కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే కచ్చితంగా బిర్యాని తిని వెళుతుంటారు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే బావర్చి బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు. బావర్చి బిరియానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన బావర్చి బిర్యానీ పై అభిప్రాయాన్ని మార్చేస్తుంది.


గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అనేకచోట్ల అపరిశుభ్ర వాతావరణన్ని గుర్తించారు. చాలా రెస్టారెంట్లకు ఫైన్లు సైతం విధించారు. అయితే అన్నిటికంటే క్వాలిటీ బిర్యాని బావర్చినే అనే పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు బావర్చి బిర్యానీ విషయంలో ప్రజల అభిప్రాయం మారే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. బిర్యానీ తిందామని మొదటిసారి బావర్చి రెస్టారెంట్ కు వచ్చిన ఒక కస్టమర్ కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ స్ట్రాప్ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న కస్టమర్ బావర్చి బిర్యాని యాజమాన్యాన్ని నిలదీశాడు. తాను బిర్యాని తో పాటు మెడిసిన్ ని కూడా తింటున్నాను అంటూ వీడియో తీశాడు. ఇది ఏ మెడిసినో చెప్పాలి అంటూ బావార్చి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఒక మెడిసిన్ స్టాప్ బిర్యానీలో ఎలా ప్రత్యక్షమైందని కస్టమర్ ప్రశ్నిస్తూ వీడియో తీశాడు. దీనికి బావార్చి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ కస్టమర్ పైనే చిందులు వేశారు.

గత కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బిరియాని వాలలో సైతం ఇదే తరహాలో బిర్యానీలో బొద్దింక ప్రతిక్షమైంది. ఆ ఘటనలోనూ యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణి కనిపించింది. ఇలా కస్టమర్లు ఎంత గొడవలు చేస్తున్నా సరే కొన్ని హోటల్స్ యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సరైన రీతిలో స్పందించడం లేదు అనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కాకుండా సాధారణ సమయంలో వెళ్లి హోటల్స్ రెస్టారెంట్లు చెక్ చేస్తున్నామంటూ అధికారులు హడావిడి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా సరే ఆయా రెస్టారెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సగటు కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశ్నిస్తున్నాడు.

Also Read

Related posts

Share via