మెహిదీపట్నం, మే 18: కారు బ్రేక్ వేయబోయి, ఎక్స్ లెటర్ తొక్కాడు. దీంతో ఫుట్పాత్ పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రఘు కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్వి ప్రసాద్ ఐ ఆస్పత్రిలో రోహిత్ కన్నా అనే డాక్టర్.. ప్రతిరోజు మాదిరిగానే ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వస్తుండగా లంగర్ హౌస్ బాపు ఘాట్ తపోవనం వద్ద రోడ్డు ఈ ప్రమాదం జరిగింది. ప్రశాంతంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఫుట్ పాత్పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న వారిపైకి కారు దూసుకు వెళ్ళింది. ఈ సంఘటనలో పండ్ల వ్యాపారులు తరుణ్ (20), తౌఫిక్ (28), సోహెల్ (35) లకు గాయాలయ్యాయి.
అయితే ఇందులో సోహెల్కు తలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్ రోహిత్ కన్నా బ్రేకు వేసే బదులు, ఎక్స్ లేటర్ తొక్కడంతోనే ఒక్కసారిగా ఫుట్పాత్ వ్యాపారులపైకి కారు దూసుకెళ్లినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న లంగర్ హౌస్ పోలీసులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, డామేజ్ అయిన కారును అక్కడి నుంచి తొలగించారు. ఈ సంఘటనలో వివిధ రకాల పండ్లు కూడా చల్లాచెదరుగా రోడ్డుపై పడిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





