కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం చెటుచేసుకుంది. స్పీడుగా దూసుకొచ్చిన కారు పోలీసుల పెట్రోలింగ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు.. మరో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి..

వివరాల ప్రకారం.. బుధవారం ఆర్థ రాత్రి విధులు నిర్వహిస్తున్న బ్లూ కోట్ పోలీస్ సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాంధారి మండల కేంద్రంలో గత రాత్రి రవికుమార్ సుభాష్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తు బైక్ పై రోడ్డు పైన నిల్చున్నారు. అతి వేగంగా దూసుకొచ్చిన కారును తప్పించుకోబోయారు. ఈ ఘటనలో రవికుమార్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయారు. కార్ వేగాన్ని గమనించి పక్కకు పరిగేత్తడంతో సుభాష్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ అంజనేయులు కుడా కొద్ది దూరంలోనే విధులు నిర్వహిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన కారు గాంధారికి చెందిన ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ది. అతని కుమారుడు కారు నడిపి కానిస్టేబుల్ మరణానికి కారకుడయ్యాడు. మద్యం మత్తులో కారు నడిపినట్లు తెలుస్తోంది. చనిపోయిన కానిస్టేబుల్ రవి కుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రవికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. పోలీస్ శాఖ తరపున ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!