SGSTV NEWS
CrimeTelangana

మాజీమంత్రి మల్లారెడ్డి పేరున్న స్టిక్కర్‌తో కారు బీభత్సం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు



మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి రహదారిపై కారు అతివేగంతో బీభత్సం సృష్టించింది. ఆ కారుపై మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి స్డిక్కర్ ఉండటం ఆసక్తిగా మారింది. ప్రగతినగర్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో ఫట్ పాత్ పై ఉన్న దుకాణాలను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. చివరికి చెరుకు రసం స్టాల్‌ ను ఢీకొట్టి ఆగిపోయింది కారు. ఈ ప్రమాదంలో షుగర్ కేన్ స్టాల్ పూర్తిగా ధ్వంసం అయింది. ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి రహదారిపై కారు అతివేగంతో బీభత్సం సృష్టించింది. ఆ కారుపై మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి స్డిక్కర్ ఉండటం ఆసక్తిగా మారింది. ప్రగతినగర్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో ఫట్ పాత్ పై ఉన్న దుకాణాలను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. చివరికి చెరుకు రసం స్టాల్‌ ను ఢీకొట్టి ఆగిపోయింది కారు. ఈ ప్రమాదంలో షుగర్ కేన్ స్టాల్ పూర్తిగా ధ్వంసం అయింది. ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


చెరుకు రసం బండి చిరు వ్యాపారీ పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు లో ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. స్టూడెంట్ సుమారు 100 కి.మీ స్పీడ్ తో రాష్ డ్రైవింగ్ చేస్తూ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి గురైన కారుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండడం ఆసక్తిగా మారింది.

కారు స్టిక్కర్‌పై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్టిక్కర్‌ ఒరిజినలా? మాజీమంత్రి మల్లారెడ్డికి కారుకు ఏం సంబంధం? లేక అది ఫేక్‌ స్టిక్కరా అని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఒక్క కారుకే స్టిక్కర్‌ ఉందా లేక ఇతర కార్లకు కూడా వేసుకుని తీరుగుతున్నారా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Also read

Related posts

Share this