SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఉరి వేసుకున్నట్లు బెదిరిద్దామనుకున్నాడు.. కట్ చేస్తే..!

 

ఫ్రాంక్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ మహానగరంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక సరదా.. విషాదంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

తిలక్‌ నగర్‌లో నివాసముంటున్న యాకయ్య కుమారుడు ఆదర్శ్‌(25) హైదరాబాద్ నగరంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ఇరువురి పెద్దలను సైతం అంగీకరించారు. వచ్చే ఏప్రిల్‌ నెలలో వీరిద్దరికి వివాహం చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి.

అయితే సోమవారం(మార్చి 3) అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రియురాలిని బెదిరించేందుకు సరదాగా ఇంటిలో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు వైరుతో ఉరేసుకుంటున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ఫొటో తీసి ఆమెకు పంపించాలని భావించాడు. అయితే ఉరి వేసుకుంటున్నట్లు చూపించే క్రమంలో పొరపాటుగా వైరు ఆదర్శ్‌ మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. దీంతో యువకుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share this