నిర్మాణంలో ఉన్న భవనం వద్ద స్లాబ్ కోసం సెంట్రింగ్ కొడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా సెంట్రింగ్ కుప్ప కూలింది. ప్రమాద సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు సెంట్రింగ్ కింద ఉన్నట్టు సమాచారం. అయితే ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ సెంట్రింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతి కష్టం మీద కార్మికులను బయటకు తీసిన స్థానికులు.. ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద స్లాబ్ కోసం సెంట్రింగ్ కొడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా సెంట్రింగ్ కుప్ప కూలింది. ప్రమాద సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు సెంట్రింగ్ కింద ఉన్నట్టు సమాచారం. అయితే ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఎలాంటి జాగ్రత్త పాటించకుండా ఓ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!