బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు పీస్‌లో క్రిశాంక్‌పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.
నీరు, విద్యుత్ కొరతతో హాస్టల్స్‌ను మూసివేస్తున్నట్లు వీసీ పేరుతో సర్క్యులర్ జారీ అయినట్లు ఫేక్ పత్రాన్ని సృష్టించారని చెప్పారు. ఈ సర్కులర్‌ను పోలీసులు కూడా ఫేక్‌గా గుర్తించారు. దీని వెనుక క్రిశాంక్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో ఈ సర్కులర్ రూపొందించినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై క్రిశాంత్ ‘ఎక్స్’లో స్పందించారు.
కేటీఆర్ నిర్వహిస్తున్న విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు తాను కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా కారును పంతంగి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారని క్రిశాంత్ తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయకుండా, ఉన్నతాధికారులు వస్తారని చెప్పి తమను చాలాసేపు నిలబెట్టారని చెప్పారు. అనంతరం కారులో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని వివరించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025