హైదరాబాద్ మహానగరం పంజాగుట్టకు చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన దుండగులు హతమార్చారు. డిసెంబర్ 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని ఎస్సార్ నగర్ కాలనీలో విగతజీవిగా కనిపించాడు. కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలో కనిపించకుండపోయిన వ్యాపారి శవమై తేలడం అనుమానాలకు తావిస్తోంది. ఎల్లారెడ్డిగూడకి చెందిన విష్ణు రూపాని డిసెంబర్ 28న అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతోపాటు సాంకేతి ఆధారాలతో గాలింపు చేపట్టారు. అయితే ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ పోలీసులకు చేరింది.
బుద్ధనగర్ బస్తీలో ఓ భవనంలో నుంచి దుర్వాసన వస్తుందని స్ధానికులు ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. అది విష్ణు రూపాని డెడ్‌బాడీగా తేల్చారు పోలీసులు. మృతదేహం లభ్యమైన చోట విష్ణు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.
అయితే ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదు. మృతుడు డెడ్‌బాడీపై ఎలాంటి గాయాలు లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు
Also Read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..