పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. బోధన్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.. బోధన్ మున్సిపాలిటీలోని మూడో వార్డు కౌన్సిలర్ అయిన కొత్తపల్లి రాధాకృష్ణ.. నిజామాబాద్ వైపునకు వెళ్తున్న సమయంలో.. తల్లికి మెడిసన్స్ తీసుకొచ్చేందుకు ఆటోలో ఓ మైనర్ బాలిక వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న బాలికను గమనించిన కౌన్సిలర్.. ఆటో వద్దకు వెళ్లి బాలికతో మాట కలిపాడు. తాను కూడా నిజామాబాద్ కే వెళ్తున్నానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఎడపల్లి వైన్స్‌కి వచ్చి మద్యం తీసుకుని తాగుతుండగా కారులో ఉన్న బాలిక గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు బాలికను ప్రశ్నించగా జరిగింది చెప్పింది. దీంతో కొన్ని కౌన్సిలర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
నిందితుడ్ని పోలీసులు బోధన్ సీఐ కార్యాలయానికి తరలించగా, బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. కౌన్సిలర్‌పై కిడ్నాప్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు ఆందోళన విరమించారు. కౌన్సిలర్ రాధాకృష్ణ ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!