SGSTV NEWS
CrimeTelangana

రోడ్డు ప్రమాదంలో ఈ పంది చనిపోయింది అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాక్..



ప్రపంచాన్ని వణికించిన కరోనాకు మందు కనిపెట్టాం. స్పేస్‌లో అద్భుతాలు చేస్తున్నాం. ఏఐ రంగంలో దూసుకుపోతున్నాం. అయినా సరే కొంతమంది మెదళ్ల నుంచి మూఢనమ్మకాలను మాత్రం దూరం చేయలేకపోతున్నాం. సమాజాన్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వివరాలు కథనం లోపల …

జంతు బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించే వ్యక్తులు సహజంగా కోళ్లు.. మేకలు బలిస్తుంటారు.. మరీ బరితెగించిన వారు మనుషులు బలిచ్చినట్లు అక్కడక్కడా వింటుంటాం… కానీ ఈ బ్యాచ్ అదో టైపు.. పందిని ( వరాహాన్ని) బలిచ్చి అంతా హడలెత్తి పోయేలాచేశారు.. గ్రామ శివారులో పందిని బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించారు.  ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామశివారులో క్షుద్ర పూజలు నిర్వహించారు.. రోడ్డు పక్కనే పూజలు నిర్వహించి జనమంతా హడలెత్తి పోయేలా చేశారు.


ఐతే క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులు వరహాన్నీ బలివ్వడం కలకలం రేపింది.. వరాహం తల భాగం నరికి ఆ రక్తంతో పూజలు నిర్వహించారు..ఆ మార్గంలో వెళ్తున్న గ్రామస్తులు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి క్షుద్ర పూజలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

Also read

Related posts