SGSTV NEWS
CrimeTelangana

Telangana: కామెర్లతో యువతి మృతి.. చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడిని కొట్టి చంపిన బంధువులు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లో దారుణం చోటుచేసుకుంది.. గుత్తి కోయల కుటుంబాలు ఉంటున్న భూసరాయి గ్రామంలో మంత్రాల నేపంతో… మడకం బీడ రాజు (35)ను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి కొట్టడంతో మృతి చెందాడు. గ్రామంలో రెండు రోజులు క్రితం ఒక మహిళ మృతి చెందడం రాజు మంత్రాలు చేయడంతోనే మృతి చెందిందనే అనుమానంతో కొందరు గ్రామస్తులు కొట్టి చంపారు.

మూఢ నమ్మకాలపై ప్రభుత్వం పలు విజ్ఞాన వేదికలు స్వచ్ఛంద సంస్థలు పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇంకా అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లో భూసరాయి గ్రామంలో గంగి అనే విద్యార్థిని పదవ తరగతి చదువుతున్నది. ఆమె కామెర్లతో బాధ పడుతూ చికిత్స పొందుతోంది.. రోజులు గడుస్తున్న కామెర్లు ముదిరిపోతున్నాయి తప్ప తగ్గటం లేదు. చికిత్స పొందుతూ రెండు రోజులు క్రితం మృతి చెందింది.. రాజు చేతబడి చేశాడు కనుకే ఆ యువతి ఎంత ఖర్చు పెట్టినా బతకలేదని కొందరు అనుమానించారు.

చేతబడి చేశాడనే అనుమానంతో బాలికకు సంబంధించిన ఏడుగురు బంధువులు కలిసి రాజును చితకబాదారు. తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలు బాగా తగలడంతో రాజు చనిపోయాడు. మృతదేహాన్ని బుసురాయి గుట్టలలో పడవేశారు. పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి నుంచి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోర్ట్ మార్టం కోసం ఇల్లందుకు తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆ యువతి అంతక్రియలు చేసిన ప్రదేశంలోనే రాజుని హతమార్చడంతో… గ్రామస్తులతో కలసి పోలీసులు గుట్టల్లో, అడవుల్లో ఆరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి.. మృతదేహాన్ని డోలికి కట్టి తీసుకువచ్చారు.

Also read

Related posts

Share this