SGSTV NEWS
CrimeTelangana

ఇద్దరితో సహజీవనం.. ఇంకొకరితో పెళ్లి.. అతని భార్యకు ఫొటోలు పంపగా.. బయటపడ్డ విదేశీ మహిళ బండారం!l



రీతూ మోని అనే బంగ్లాదేశ్ మహిళ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, హైదరాబాద్‌లో నరేష్, శంకర్‌రావులతో సహజీవనం చేసింది. తర్వాత ప్రవీణ్‌తో వివాహం చేసుకుంది. అయితే ప్రవీణ్‌కు ఆమె నిజ స్వరూపం తెలిసి అతను తన భార్యకు ఫోటోలు పంపడంతో ఆమె బంగ్లాదేశ్‌కు వలస పోయేలా డిపోర్ట్ చేయబడింది.


ఓ మహిళ దొంగదారిలో ఇండియాలోకి వచ్చింది. పేరు మార్చుకొని ఓ వ్యక్తికి దగ్గరైంది. అతనితో ఉంటూనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది. వీళ్లిద్దరూ కాదంటూ మరో వ్యక్తిని సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకొని అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ వేరే దేశానికి చెందిన మహిళ అని తెలిసి అతను దూరం అయ్యాడు.. దీంతో ఆమె అతని భార్యకు కొన్ని ఫొటోలు పంపింది. ఆ తర్వాత.. ఆమె బండారం బయటపడింది. వింటుంటే ఏదో సినిమా స్టోరీలా ఉన్నా.. ఇది నిజంగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్‌లోనే. ఈ సస్సెస్‌ స్టోరీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రీతూ మోని బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ. 2020లో అక్రమ మార్గంలో ఇండియాకి బతుకుదెరువు కోసం వలస వచ్చింది. ఆ పని ఈ పని చేసుకుంటూ తన పేరును రీతూ మోని నుంచి రీతూ రావుగా మార్చుకొని హైదరాబాద్‌లో మకాం వేసింది. ఈ క్రమంలోనే ఆమెకు ఆసిఫ్‌ నగర్‌కు చెందిన నరేష్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కూడా సోషల్‌ మీడియా ద్వారా.. ఆ తర్వాత ఇద్దరు కలవడం వారి బంధం బలపడటంతో ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేశారు. ఇదే అదునుగా ఆసిఫ్‌ నగర్‌ అడ్రస్‌తో ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకుంది. నరేష్‌తో ఉంటూనే సోషల్‌ మీడియాలో గన్‌ఫౌండ్రీకి చెందిన శంకర్‌రావు అనే వ్యక్తి పరిచయం కావడంతో గాలి అటు మళ్లింది. నరేష్‌ను వదిలేసి.. శంకర్‌రావుతో ఉండటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన ఆధార్‌ అడ్రస్‌ను గన్‌ఫౌండ్రీకి మార్చుకుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. ఓ రోజు షాంపూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో శంకర్‌ రావు ఆమెను గుడిమల్కాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు.

అయితే అప్పటికే నిజామాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. శంకర్‌రావుతో ఉంటూనే ప్రవీణ్‌నుతో కూడా ఆమె ఆన్‌లైన్‌ ప్రేమాయాణం నడిపింది. అయితే ఆస్పత్రిలో ఉన్న సమయంలో తనను శంకర్‌రావు వదిలేశాడని, తనను తీసుకెళ్లమని ప్రవీణ్‌కు ఫోన్‌ చేసింది. ప్రేయసి బాధలో ఉందని.. లగెత్తుకొచ్చిన ప్రవీణ్‌.. ఆస్పత్రి బిల్లు కట్టేసి ఆమెను తీసుకెళ్లి విద్యానగర్‌ ఫ్లాట్‌ ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేశారు. ఆమె ఒత్తిడి చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 15న యాదగిరి గుట్టలో పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, రీతూతో ఉంటున్న సమయంలోనే ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అనే కొన్ని పత్రాలు ప్రవీణ్‌ కంట పడ్డాయి. అంతే.. అతని వెన్నులో వణుకుపుట్టింది. అప్పుడే పహల్గామ్‌ ఉగ్రదాడి వంటి ఘటనలు జరగడంతో భయపడిపోయిన ప్రవీణ్‌ ఆమెకు చెప్పాపెట్టకుండా నిజామాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే ఎలాగైనా ప్రవీణ్‌ను దక్కించుకోవాలని అనుకున్న రీతూ.. ఏకంగా ప్రవీణ్‌ భార్యకు సోషల్‌ మీడియా ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టింది. ఆమె యాక్సెప్ట్‌ చేయడంతో ప్రవీణ్‌తో తనకున్న బంధం గురించి చెప్పింది. అలాగే యాదగిరి గుట్టలో తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పి, పెళ్లి ఫొటోలు కూడా పంపింది.


అది చూసి షాక్‌ తిన్న ప్రవీణ్‌ భార్య.. ఇదేంటని ప్రవీణ్‌ను నిలదీసింది. దీంతో ప్రవీణ్‌ మొత్తం నిజం భార్యకు చెప్పేశాడు. తాను చేసింది తప్పే అని, కానీ, ఇప్పుడు ఆమె తనను వేధిస్తోందని చెప్పాడు. దాంతో ప్రవీణ్‌, అతని భార్య కలిసి నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు రీతూని పిలిచి విచారించడంతో ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళగా తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. న్యాయనిపుణుల సలహా మేరుకు డిపోర్టేషన్‌ చేయాలని నిర్ణయించుకొని షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. ఆమెతో పాటు ప్రవీణ్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. అలాగే గతంలో ఆమెతో సహజీవనం చేసిన నరేష్‌, శంకర్‌ల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు.

Also read

Related posts

Share this