SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పైకి చూసి అమాయకుడనుకునేరు.. పక్కా 420.. ఈ అమ్మాయిని ఏం చేశాడంటే.?



ఓ యువతికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. తల్లిదండ్రులు తీవ్రంగా విచారించారు. ఈలోగా ఓ బాబా వచ్చి.. ‘మీ కూతురుకు నేను నయం చేయగలను’ అని దర్గా తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిందే అసలు ట్విస్ట్.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.


హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో నివసించే కుటుంబానికి చెందిన ఒక యువతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణే నుంచి ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఇదే అదనుగా మంత్రించి యువతికి బాగుచేస్తానని చెబుతూ ఓ బాబా రోజూ ఇంటికి వచ్చేవాడు. మంత్రాలు వేస్తే ఆరోగ్యం మెరుగవుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు ఆ యువతిని అతని వద్దకు తరచూ పంపించసాగారు. ఒక దశలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువతిని దర్గాలో మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని నమ్మించి ఆమెను తీసుకెళ్లి తనతో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.



వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులకు ఒక ఫోన్ కాల్ చేసింది. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ తాను మేజర్‌ని అని, ప్రేమించి స్వచ్ఛందంగా అతనిని వివాహం చేసుకున్నానని చెప్పింది. అంతేకాదు సమయం, సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకున్నానని, అంతా తన ఇష్టపూర్వకంగానే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది. యువతి స్వచ్ఛందంగా వెళ్లిందని తెలిసిన వెంటనే మిస్సింగ్ కేసును పోలీసులు క్లోజ్‌ చేశారు.


ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.? బాబాకి ఇది వరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్రంగా విచారంలో మునిగిపోయారు. తమ కూతురు తిరిగి తమ దగ్గరికి రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మాయ మాటలు చెప్పి మంత్రాల పేరిట యువతిని ప్రభావితం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ వేడుకుంటున్నారు

Also read

Related posts