ములుగు జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన అంగన్వాడీ టీచర్ మర్డర్ మిస్టరీ సంచలనం సృష్టించింది. విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన ఆ మహిళ తాడ్వాయి శివారు అడవిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ మర్డర్ మిస్టరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తాడ్వాయి పోలీసులు 48 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన రడం సుజాత అనే మహిళ తాడ్వాయి మండలం కాటాపూర్లో అంగన్ వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన సుజాత ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. విచారణ జరుపుతున్న క్రమంలోనే సుజాత శవమై విగతజీవిగా కనిపించింది. తాడ్వాయి మండలం నాంపల్లి శివారు అడవిలోకి తీసుకెళ్ళి చున్నీతో గొంతు నులిమి హత మార్చారు. ఈ హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు గుర్తించారు. అంగన్ వాడీ టీచర్ మర్డర్ మిస్టరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కేవలం 48 గంటల వ్యవధిలోనే డిటెక్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ & టెక్నికల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు వివరాలు మీడియా ముందు వెల్లడించారు.
నిందితులు ఇద్దరూ ఏటూరునాగరం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన రామయ్య, జంపయ్యగా గుర్తించారు. కాటపూర్లో విధులు ముగించుకొని బస్సు కోసం ఎదురు చూస్తున్న సుజాత బస్సు మిస్సవడంతో రామయ్య తన బైక్పై తీసుకెళ్ళాడు. మార్గమధ్యలో తన స్నేహితుడు జంపయ్యతో కలిసి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడు, ATM కార్డు అపహరించుకు పోయారు. సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారు. 48 గంటలలోపే మర్డర్ మిస్టరీని ఛేదించిన తాడ్వాయి ఎస్ఐ అండ్ టీమ్ లను జిల్లా ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్ అభినందించారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం