ఓ ఇందిరమ్మ ఇంటి లబ్దిదారున్ని.. ఆ ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ తీవ్రంగా అవమానించాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఏకంగా చెట్టుకు కట్టేసి దాడికి దిగాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ ఇందిరమ్మ ఇంటి లబ్దిదారున్ని.. ఆ ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ తీవ్రంగా అవమానించాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఏకంగా చెట్టుకు కట్టేసి దాడికి దిగాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని కోట ( కె) గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తికి ఇటీవలే ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో మారుతి ఇంటి నిర్మాణ బాధ్యతను సత్యనారాయణ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. దీంతో సత్యనారాయణ ఇంటి పనులను మొదలు పెట్టాడు.
అయితే నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల మారుతికి రూ.లక్ష మంజూరు చేసింది. అయితే బిల్లు వచ్చినా తనకు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ మంగళవారం మారుతి దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ మారుతిని చెట్టుకు కట్టేసి డబ్బుల కోసం అరగంటపాటు నిలదీశాడు.
అడ్డుకునేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆ కాంట్రాక్టర్ తన వినలేదు. దీంతో స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు. లబ్దిదారుడు మారుతితో పాటు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





