నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సారంగపూర్ సమీపంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. పారిపోతుండగా.. పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అయితే మరో వ్యక్తితో ఘర్షణలో నిందితడికి గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిజామాబాద్లో సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడ్ని పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రమోద్‌ను కత్తితో పొడిచి పరారైన నిందితుడు రియాజ్‌ను నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన లారీ క్యాబిన్‌లో దాక్కునట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. డ్రోన్‌లతో అన్వేషిస్తూ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిక్కినట్టే చిక్కి.. పారిపోతుండగా ఛేజ్ చేసి మరీ పట్టుకోవాల్సి వచ్చింది. అయితే మరో వ్యక్తితో జరిగిన గొడవలో గాయాలు అవ్వడంతో ప్రస్తుతం రియాజ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితడు ఎన్‌కౌంటర్‌లో హతమయినట్లు వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. వేరే వ్యక్తితో జరిగిన ఘర్షణలో మాత్రమే రియాజ్‌కు గాయాలయినట్లు వివరించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న రియాజ్‌ను అతని మేనల్లుడి ఆకాశ్ సాయంతో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని బెక్‌పై వెళ్తుండగా.. సడెన్‌గా కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతిలో పొడవడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్, ఎస్సై విఠల్‌ను గాయపరిచి పారిపోయాడు. దీంతో.. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య.. నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు.
రెండు రోజులుగా డ్రోన్‌లు, స్పెషల్ టీమ్‌లతో రియాజ్ కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తుండగా.. శనివారం రాత్రి నిజాంసాగర్ కెనాల్ సమీపంలో చిక్కినట్టే చిక్కి పారిపోయాడు. దీంతో మరింత ఫోకస్ పెట్టి సమీప ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే.. సారంగపూర్ దగ్గర ఉన్నాడనే పక్కా సమాచారంతో ఎటాక్ చేసి నిందితుడు రియాజ్‌ను అరెస్ట్ చేశారు. ఇక.. రియాజ్‌పై నిజామాబాద్ జిల్లాలో 40 కేసులు ఉండడం షాకిస్తోంది. వెహికల్స్ చోరీ, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్.. బెయిల్పై రిలీజై నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు
Fack video
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..