SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: కాలేజీలో దాండియా ఈవెంట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి

ఇంజినీరింగ్ కళాశాల దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి

నాదరుల్: దసరా పండగ వేళ విద్యార్థులు ఉత్సాహంగా దండియా ఆడుతుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా నాదరుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దాండియా ఈవెంట్ ()లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాలేజీ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కలిసి దాండియా నృత్యం చేస్తుండగా.. లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ సాయంత్రం కాలేజీ సమీపంలో గాలివాన రావడంతో లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కింద పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 25 మంది విద్యార్థులు గాయపడగా.. అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు, సిబ్బంది హుటాహుటిన వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

లైటింగ్ సిస్టమ్ కూలి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

Also read

Related posts