మెదక్ డిగ్రీ కాలేజీలో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది ఘటన సంచలనంగా మారింది. దివ్యకృప అనే యువతిపై చేతన్య అనే యువకుడు కత్తితో దాడి చేసి పారిపోగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
మెదక్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం ఉదయం దివ్య కృపపై జరిగిన హత్యాయత్నం చేసిన నిందితుడు దనసిరి చైతన్యను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. చేతన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 నుంచి దివ్య కృపతో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో వేధించడంతో, అమ్మాయి అతడిని దూరంగా ఉంచడంతో ఆ కోపంతో హత్య యత్నానికి పాల్పడినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
నిందితుడిని మెదక్ పట్టణంలోని బస్టాండ్లో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, రక్తపు మరకలు అంటిన షర్టును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మాయిలు తెలియని వారితో , పరిచయం లేని వారితో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర సామాజిక మాధ్యమాలలో సమాచారం పంచుకోవద్దని సూచించారు. పరిచయం లేని వ్యక్తులకు ఫోటోలు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. అమ్మాయిలు ఎవరైనా ఆకతాయిలు ఫోన్లో గాని ఎక్కడైనా కానీ బస్టాండ్ వద్ద గాని వేధించినట్లు గుర్తిస్తే వెంటనే షీ టీంకుగాని, 100 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కాలేజీ పరిసరాల్లో విద్యార్థులు వేధిస్తున్నట్లయితే ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలన్నారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!