అతడు ఒకప్పుడు హోంగార్డ్.. వివాహేతర సంబంధం, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అడ్డదారుల్లోకి వెళ్ళాడు. దొంగగా మారాడు. ఏకంగా 36 కేసులలో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ హోంగార్డ్..? దొంగగా ఎలా మారాడు? అన్నదీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
రాజస్థాన్ కు చెందిన మహేందర్ సింగ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డ్‌గా పనిచేశాడు. అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో చెడు అలవాట్లకు బానిస అయిన హోంగార్డు అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే 2012 నుండి 2015 వరకు వరుస చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు ఇప్పటివరకు బాచుపల్లి, కేపీహెచ్‌బీ, సనత్ నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మహేందర్ సింగ్ పై పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు పోలీసులు.
Also read :శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి
నిందితుడు మహేందర్ సింగ్ పై పీడీ యాక్ట్ పెట్టిన అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. తాజాగా జూన్ నెల 24న బాచుపల్లిలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగలించాడు. అనంతరం జీడిమెట్ల, జగద్గిరిగుట్ట లోను మరో ఇద్దరి మహిళల నుంచి బంగారు గొలుసులను దొంగలించాడు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మహేందర్ సింగ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నిందితుడు మహేందర్ సింగ్ నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారంతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
Also read తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!
అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..