సాధారణంగా ఎవరైనా వారికి న్యాయం జరుగుతుందని నమ్మి.. పోలీసులు వారికీ న్యాయం చేకూరుస్తారని భావించి.. స్టేషన్ కు వెళ్తారు. కానీ, అక్కడ న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయానికి పాల్పడితే .. వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకుంటారు.
సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ సమాజంలో ఎవరికీ భద్రతా లేకుండా పోతుందని చెప్పడంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిస్థితులు మెరుగుపడతాయేమో అనే ఆలోచన కూడా రానివ్వకుండా చేస్తున్నారు ఆగంతకులు. సహజంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే.. ముందుగా అందరికి గుర్తొచ్చేది పోలీసులే. ఎందుకంటే, సమాజానికి సేవ చేయడం కోసం, ప్రజలను రక్షించడం కోసమే ఆ వృత్తి ఉంది. కాబట్టి ఎవరికీ ఏ కష్టం కలిగినా న్యాయ పరంగా ఆ కష్టాన్ని అధిగమించాలని.. పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారు. కానీ, న్యాయం చేయాల్సిన పోలీసులే .. అన్యాయానికి పాల్పడి .. ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వారు ఇంకెవరికి చెప్పుకుంటారు. ఇలాంటి సంఘటనే ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
జగిత్యాలలోని ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన 23 ఏళ్ళ ఓ వివాహిత.. తన భర్త తనను వేధిస్తున్నాడంటూ.. రోజు త్రాగి వచ్చి కొడుతున్నాడంటూ.. తనకు ఎలా అయినా న్యాయం చేయాలని.. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. సాధారణంగా ఇటువంటి కేసులలో భార్య భర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి .. సర్ది చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ కేసులో కూడా జరిగింది అదే. ఆ యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన టైమ్ లో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు.. ఆ యువతి భర్తను పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చాడు. అయినా సరే, అతనిలో ఏ మార్పు రాకపోవడంతో.. రోజు ఏవో ఒక గొడవలు జరుగుతూ ఉండేవి. దీనితో ఆ యువతి తరచూ స్టేషన్ కు వస్తూ ఉండేది. దీనితో ఏఎస్ఐ ఆ యువతిపై కన్నేశాడు.
ఆమె భర్త గురించి విచారణ పేరుతో.. తరచూ ఆమెకు ఫోన్స్ చేస్తూ.. మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఆ ఏఎస్ఐకు సుమారు 53 సంవత్సరాలు ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈ విషయాన్నీ మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఆ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐను మందలించడంతో.. ఈ విషయాన్నీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవద్దని.. త్వరలో రిటైర్మెంట్ కూడా ఉందని.. తన పద్ధతి మార్చుకుంటానని ప్రాధేయపడడంతో.. ఆ ఏఎస్ఐ ను మందలించి వదిలేశారు. అయితే, గత రెండు రోజులుగా ఆ ఏఎస్ఐ సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు.. సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. దీనితో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఏఎస్ఐపై ఉన్నత ఆధికారులకు కంప్లైంట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం