ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌను గూడా గ్రామపంచాయతీ పరిధిలోని రేణిగూడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం 120 మంది కూలీలు ఉపాదిహామీ పనుల్లో భాగంగా మట్టి తవ్వకం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ అక్కడే చెట్ల పొదల్లో ఉన్న తేనె తుట్టి నుండి తేనెటీగలు ఒక్కసారిగా లేచి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల బృందంపై బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో తేనేటీగల ముల్లులు గుచ్చుకుని 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలకు స్వల్ప గాయాలవగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది 5 ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసి బాదితులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రిమ్స్ డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం తేనీటీగల దాడిలో గాయపడ్డ బాదితుల ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని.. కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!