బ్యాంకాక్ వయా దుబాయ్.. టూ భారత్ వచ్చిన మహిళ.. ఎయిర్ పోర్టు చెకింగ్‌లో అనుమానాస్పదంగా కనిపించింది. తీరా లగేజి చెక్ చేసేటప్పుడు మహిళను ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. అదేంటో..? ఆ వివరాలు.? ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాధకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైడ్రోఫోనిక్ గంజాయిని బ్యాంకాక్‌లో కొన్నట్లు మహిళ అధికారులు తెలిపినట్లు సమాచారం. విమానంలో తరలిస్తే ఎవరికీ అనుమానం రాదని భావించినట్లు సదరు మహిళ.. అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్, భారత్ మధ్య డ్రగ్స్ సిండికేట్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్‌లో హైడ్రోఫోనిక్ గంజాయికి డిమాండ్ ఉండడంతో ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపింది. బ్యాంకాక్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నా.. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025