SGSTV NEWS
CrimeTelangana

Telangana: పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

కష్టపడి డబ్బు సంపాదించాల్సింది పోయి.. ఈజీగా వేలో మనీ రాబట్టాలని ప్రయత్నించాడు ఓ వ్యక్తి. కట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత ఏం జరిగిందో.. ఇప్పుడు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.. లేట్ ఎందుకు మరి..


అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి.. అన్నట్లుగా మారింది ఓ వ్యక్తి ప్లాన్..! పంటలు సాగు చేయాల్సిన చోట గంజాయి మొక్కలు సాగు చేసి లక్షలు సంపాదించాలని ప్లాన్ వేసాడు ఒక అతను. కానీ అది కాస్తా ఫెయిల్ అవ్వడంతో పెద్ద షాక్ తగిలింది. పంటలు సాగు చేస్తే వచ్చే దిగుబడి అమ్మకాలకు పదో పరక వస్తుందని భావించిన మాసుల గౌస్ షోద్దీన్ అనే వ్యక్తి.. గంజాయి మొక్కలను సాగు చేసి.. వాటిని అమ్మి లక్షలు గడిచాలని ఆశపడ్డాడు. చివరికి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి ఊసలు లెక్కపెడుతున్నాడు.


ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

వివరాల్లోకి వెళితే.. మాసుల గౌస్ సొద్ధిన్ అనే వ్యక్తి తనకున్న భూమిలో పంట సాగుకు బదులు 39 గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ మధుబాబు, ఎస్ఐ నాగేందర్‌ సిబ్బందితో కలిసి 2019 ఏప్రిల్ 2న గంజాయి మొక్కలపై దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై గౌస్ సోద్దిన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తక్కడుపల్లి గ్రామంలో ఈ ఘటన 2019లో చోటు చేసుకుంది. కాగా నేడు మంగళవారం సంగారెడ్డి అడిషనల్ జిల్లా ప్రధాన జడ్జి నిందితుడు గౌస్ సోద్దీన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ 25,000 జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

Also read

Related posts

Share this