సిగరెట్ వెలిగించుకొనేందుకు అగ్గిపెట్టె అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని దారుణంగా చంపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.
దిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సిగరెట్ వెలిగించేందుకని అగ్గిపెట్టె అడిగితే ఇవ్వలేదని ఇద్దరు టీనేజర్లు ఘాతుకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. నార్త్ ఢిల్లీలోని తిమార్పుర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై డీసీపీ ఎంకే మీనా మాట్లాడుతూ.. “శనివారం తిమారుర్ పోలీస్ స్టేషన్కు పీసీఆర్ కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల బృందం.. ఆటోలో రక్తపు మడుగులో గాయాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయడంతో పాటు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. ఈ కేసులో నిందితులిద్దరూ టీనేజర్లే. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనలో నిందితులు ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులను ప్రశ్నించగా.. సిగరెట్ వెలిగించుకొనేందుకు అగ్గిపెట్టె అడిగితే ఇవ్వలేదని.. దీంతో తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకడు కత్తితో పొడిచాడని, ఇద్దరు అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు” అని డీసీపీ వివరించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకడు గతంలోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025