SGSTV NEWS
Technology

పీపుల్ బి కేర్ ఫుల్..! దేశీ యాప్‌ల పేరుతో కొత్త దందాకు తెర లేపిన కేటుగాళ్లు..!



నేటి స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మనిషి జీవితంతో విడదీయరాని స్థాయిలో పెనవేసుకుపోయాయి. సోషల్ మీడియా యాప్‌లు చూడందే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. యాప్స్‌ మాటునే సైబర్ నేరగాళ్లు ఉన్నారు..అదమరిచితే అంతే సంగతులు ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త అంటున్నారు నిఫుణులు.


నేటి స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు మనిషి జీవితంతో విడదీయరాని స్థాయిలో పెనవేసుకుపోయాయి. సోషల్ మీడియా యాప్‌లు చూడందే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. యాప్స్‌ మాటునే సైబర్ నేరగాళ్లు ఉన్నారు..అదమరిచితే అంతే సంగతులు ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త అంటున్నారు నిఫుణులు.

మీ మొబైల్‌ ఫోన్లలో ఉపయోగిస్తున్న యాప్స్ ఎంతవరకు సురక్షితం. దశాబ్ద కాలంగా మానవాళితో ముడి వేసుకున్నాయి సోషల్ మీడియా యాప్స్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ ప్రపంచంలోకి పోటీ ఇచ్చేందుకు కొన్ని భారతీయ అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. విదేశీ యాప్స్‌కు మనదేశ యాప్స్ పోటీ ఇస్తాయా? అసలు సోషల్ మీడియా అప్లికేషన్స్ లో భద్రత ఎంత? అన్న ప్రశ్నలు ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారిలో తలెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో రకరకాల కొత్త యాప్‌ల పేర్లతో మెసేజెస్ ఈ మధ్యకాలంలో చాలా కనిపిస్తున్నాయి. కొత్త కంపెనీలను టాలెంట్లను కచ్చితంగా ప్రోత్సహించాల్సిందే.. అదే సమయంలో కొన్ని యాప్‌ల భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇతర దేశాల కంపెనీలు కూడా మేడిన్ ఇండియా మేకింగ్ ఇండియా అంటూ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. పాత, కొత్త ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్లతో కొన్ని ప్రమాదాలను ఇప్పటికే ఎదుర్కొన్నాము. రానున్న రోజుల్లో వీటి తీవ్రత పెరిగే అవకాశముందంటున్నారు పరిశీలకులు.

ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న కొన్ని యాప్‌లకు ఆల్టర్నేటివ్ యాప్స్ కనిపిస్తున్నాయి. కొత్త యాప్స్ అంటూ ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నవన్నీ కూడా నిజానికి భారత్‌లో రూపొందినవికావు. కొంతమంది విదేశీ డెవలపర్స్ మార్కెటింగ్ కోసం ఇండియన్ యాప్స్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెడుతున్నారు. గతంలో టెలిగ్రామ్ యాప్‌ విషయంలో దేశమంతా ఇలాంటి ప్రచారమే జరిగింది.

ఈ విషయం పక్కన పెడితే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వాడడం వల్ల లాభాలేంటి నష్టాలు ఏంటన్న విషయం పరిశీలిస్తే కొన్ని యాప్‌ల ద్వారా లైవ్ లొకేషన్ చోరీ అయ్యే అవకాశాలున్నాయని తేలింది. వాట్సాప్ పూర్తిగా ఎండ్‌టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. ఇందులో సమాచారం లీక్‌ అసాధ్యం.. అయితే సిగ్నల్ యాప్ అనే యాప్‌ను పరిశీలిస్తే అతి సురక్షితమైన యాప్‌ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు దీన్ని ఉపయోగించారు. కాని కశ్మీర్లో జరిగిన కాల్పుల విషయంలో సమాచారం పంపిణీ ఈ యాప్‌ ద్వారానే జరిగాయని నిఘా వర్గాలు తేల్చాయి.ఇలా సాధారణ ప్రజల సమాచారం కొన్ని యాప్స్ ద్వారా లైవ్ లొకేషన్‌ చోరీ అయ్యే అవకాశం ఏర్పడిందంటున్నారు పరిశీలకులు.

మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు అన్ని టర్మ్స్‌కు ఓకే చెపుతూ డౌన్‌లోడ్ చేసుకోవడమే ముప్పు తెస్తుందంటున్నారు పరిశీలకులు. యాప్‌ అవసరం మేరకు ఏ పర్మిషన్స్ అవసరమో జాగ్రత్తగా ఆలోచించి వాటికి మాత్రమే ఓకే చెప్పాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు వాట్సాప్ లాంటి చాటింగ్ యాప్ తీసుకుంటే కేవలం కాంటాక్ట్స్, ఫోన్, మైక్రోఫోన్, కెమెరా అనుమతులు ఇస్తే సరిపోతుంది. కానీ సిస్టం అడుగుతోంది కదాని లోకేషన్, గ్యాలరీ ఇలా అడిగిన అన్నింటికీ ఒకే చెప్తూ మన మొబైల్ కమాండ్ మొత్తం యాప్‌ చేతిలో పెడుతున్నాం. ఇది ఒక్కో సమయంలో మనకు హానీ కలిగించే అవకాశముందంటున్నారు పరిశీలకులు

భారతీయ యాప్స్ పేరుతో లేదా భారతీయులు క్రియేట్ చేసిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నా అందులో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటో చూసుకోవాలంటున్నారు. సెక్యూరిటీ తక్కువగా ఉన్న అప్లికేషన్స్ వల్ల వ్యక్తిగత భద్రతకేకాక, దేశ భద్రతకే ముప్పు కలిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సో పీపుల్ బి కేర్ ఫుల్ వైల్ డౌన్‌లోడింగ్ యాప్స్..!

Also read

Related posts