November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

లేబర్ కార్డుల జారీ లో సాంకేతిక లోపాలు సరిచేయాలి…. గ్రీష్మ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి. ఐ.యఫ్.టి.యు.



         నిడదవోలు మండలం పెండ్యాల లో ఐ‌.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు.
       ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ, కార్యదర్శి కారింకి రమేష్ లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ జీవనోపాధి నిలుపుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వం నుంచి తమకు ఏవిధమైన సహాయ, సహకారాలు అందడం లేదన్నారు.
     ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డు లు పొంది దశాబ్దాలుగా వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందేవారనీ,  కార్మికులు తమ ఆధార్ ద్వారా రేషన్, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ వంటి వివిధ ప్రభుత్వ పధకాలను పొందగలుగుతున్న కార్మికులు కార్మిక శాఖ లోని సాంకేతిక లోపాల కారణంగా ఆధార్ లో లోపం వుందంటూ గుర్తింపు కార్డు ల జారీ నిలిచి పోయిందని, ఫలితంగా తమ ఆర్థిక పరిహారాలకోసం దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈవిధంగా వ్యవహరిస్తోందని, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, లోపాలు సరిచేసి, గుర్తింపు కార్డు ల జారీ చేయాలని డిమాండ్ చేశారు.
         పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాకా రాంబాబు, ప్రత్తి పాటి వెంకటేశ్వరరావు,  సత్తిబాబు, మిద్దె రాంబాబు తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via