March 13, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

Techie suicide: మగాళ్ల కష్టాలూ పట్టించుకోండి



భార్య వేధింపులు భరించలేక రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకొన్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తరహాలో ఆగ్రాలో మరో బలవన్మరణం కేసు తాజాగా నమోదైంది.

ఆగ్రా(యూపీ): భార్య వేధింపులు భరించలేక రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకొన్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తరహాలో ఆగ్రాలో మరో బలవన్మరణం కేసు తాజాగా నమోదైంది. ముంబయిలోని ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజరుగా పనిచేస్తున్న ఆగ్రావాసి మానవశర్మ (30) తన మరణానికి భార్య నికితాశర్మ (28) కారణమని పేర్కొంటూ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డు చేసిన వీడియో రెండు రోజుల తర్వాత వెలుగుచూడటంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వీడియోలో తల్లిదండ్రులను క్షమాపణ కోరిన మానవ్ “దయచేసి, మగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గుర్తించి వారి కోసం ఎవరైనా మాట్లాడండి. మగాళ్లు ఒంటరై పోతున్నారు” అని సమాజాన్ని కోరాడు. తన భార్యకు మరో బాయ్ఫ్రెండ్ ఉన్నట్లు తెలిపాడు. గతేడాది జనవరిలో మానవ్, నికితల వివాహం జరిగింది. వీరిద్దరూ ఫిబ్రవరి 23న ఆగ్రాకు వచ్చారు. భార్యను ఆమె పుట్టింట్లో దిగబెట్టాడు. అక్కడ అతణ్ని అవమానించినట్లు



తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి తిరిగివచ్చిన మానవ్ మరుసటిరోజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మానవ్ రికార్డు చేసిన వీడియోను అతడి చెల్లెలు ఆలస్యంగా చూసింది. ఈ వీడియో ఆధారంగా మృతుని తండ్రి నరేంద్రశర్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానవ్ ఆరోపణలను ఖండిస్తూ నికిత మరో వీడియో విడుదల చేశారు. అతడు తనను తిట్టేవాడని, తాగినప్పుడు అదుపుతప్పి ప్రవర్తించేవాడని పేర్కొన్నారు.

Also read

Related posts

Share via