February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే!


రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్‌ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్‌ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Teacher Harassment News: చదువులు చెప్పే టీచర్లు కామకోరికలతో నీతిమానుల పనులు చేస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్‌ రావు టెన్త్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో దినావర్‌ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్.  ప్రిన్సిపల్‌ దీనావన్‌ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.  దినావర్‌ రావుపై గతంలోనూ లైంగికదాడి
ఆరోపణలున్నాయి.  విద్యార్థినులను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ సారి ఇలాగే చేస్తే విద్యార్థిని తల్లిదండ్రులు ఇతనికి దేహశుద్ది చేశారు. ఇలాంటి ప్రిన్సిపల్‌ను అసలు వదలకూడదని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి.

Also read

Related posts

Share via